
యాదాద్రి భువనగిరి:,l 30 డిసెంబర్ (హి.స.)
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి భక్తులకు ఉత్తర రాజగోపురం మీదుగా దర్శనమిచ్చారు. మంగళవారం ఉదయం వైకుంఠనాథుడి దర్శనం కోసం భక్తులు విశేష సంఖ్యలో విచ్చేశారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు తదితరులు విచ్చేశారు.భక్తులు, వీఐపీల కోసం ఆలయ ఉత్తర మాడవీధుల్లో ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు