మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
మంగళగిరి, 30 డిసెంబర్ (హి.స.) డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం (Shankara Guptam) మేజర్ డ్రెయిన్ (Major Drain) ఆధునీకరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా పనులను డిప్యూటీ సీ
పవన్ కళ్యాణ్


మంగళగిరి, 30 డిసెంబర్ (హి.స.)

డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం (Shankara Guptam) మేజర్ డ్రెయిన్ (Major Drain) ఆధునీకరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా పనులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వర్చువల్ గా పాల్గొనగా.. శంకరగుప్తంలో నిర్వహించిన ప్రత్యక్ష కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, జిల్లా కలెక్టరుతో పాటు జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

అయితే మొంథా తుఫాను కారణంగా కోనసీమ ప్రాంతంలోని డ్రెయిన్ సరిగ్గా పని చేయలేదు. దీంతో కొబ్బరి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శంకరగుప్తంలోని కొబ్బరి రైతులు ఎంతగానో నష్టపోయారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం స్వయంగా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి కొబ్బరి రైతులను పరామర్శించారు. వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీనిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణ పనులను నేడు వర్చువల్ గా ప్రారంభించారు.

.

---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande