
శ్రీశైలం , 30 డిసెంబర్ (హి.స.)
చెంచులకు ఉచితంగా స్పర్శ దర్శనం (Sparsha Darshanam) కల్పించాలని శ్రీశైలం దేవస్థానం పాలకమండలి నిర్ణయించింది. అందులో భాగగా మంగళవారం గిరిజనులైన చెంచులకు (Chenchu Tribals) స్పర్శన దర్శనం కల్పించింది. ఉదయం 11 గంటలకు క్యూలైనులో నిలుచున్న చెంచులు స్వామివారిని నేరుగా దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. అంతేకాకుండా శ్రీశైలం (Srisailam) మల్లికార్జున స్వామి వారిని స్పర్శించి తన్మయత్వానికి లోనయ్యారని పేర్కొన్నారు. గిరిజనులకు స్వామివారిని మరింత చేరువ చేసే సద్భావనతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తద్వారా వారికి స్వామివారి పట్ల భక్తి భావాలు మరింత పెంపొందుతాయని ఆకాంక్షించారు. అయితే ప్రతి నెలలో ఒక రోజు ఎంపిక చేసి చెంచులను స్పర్శ దర్శనం కల్పించనున్నామని వెల్లడించారు. తద్వారా ఆ రోజు వారికి ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించడం జరుగుతుందన్నారు. ఐటీడీఏ సహకారంతో దర్శనానికి వచ్చే గిరిజనులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. వారికి ప్రయాణ వసతి, తిరుగు ప్రయాణ ఏర్పాట్లు కూడా ఉంటాయని ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV