మదనపల్లెలో కలపడం వల్ల ఎలాంటి లాభం లేదు
మదనపల్లె, 30 డిసెంబర్ (హి.స.) అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను చేస్తూ.. అందులో రాయచోటిని (Rayachoty) కలపడం వల్ల తమ ప్రాంత ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని ఎన్ఆర్ఐ టీడీపీ అధికార ప్రతినిధి చెంచు వేణుగోపాల్ రెడ్డి (Chenchu Venugopal Reddy) అభిప్రాయ
there-is-no-benefit-in-mixing-in-madanapalle-


మదనపల్లె, 30 డిసెంబర్ (హి.స.)

అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను చేస్తూ.. అందులో రాయచోటిని (Rayachoty) కలపడం వల్ల తమ ప్రాంత ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని ఎన్ఆర్ఐ టీడీపీ అధికార ప్రతినిధి చెంచు వేణుగోపాల్ రెడ్డి (Chenchu Venugopal Reddy) అభిప్రాయపడ్డారు. రాయచోటి ప్రజల తరపున తన గళాన్ని ఆయన విప్పారు. రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా అయినా ఉంచాలని.. లేదా కనీసం రెవెన్యూ డివిజనుగా అయినా కొనసాగించాలన్నారు. అది కూడా కుదరని పక్షంలో ఉమ్మడి కడప జిల్లాలోనే ఉంచాలన్నారు. మదనపల్లెతో మమేకం చేయడం వల్ల ప్రాంత ప్రజలు నష్టపోతారని పేర్కొ్న్నారు. ఎన్నికల సమయంలో వేల మంది సాక్షిగా రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగిస్తామనే హామీని పార్టీ తరపున ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే ప్రజలను, కార్యకర్తలను మోసం చేసినట్లు అవుతుందని అన్నారు.

కేబినెట్ తీసుకున్న నిర్ణయం తమకెంతో మనోవేదన కలిగిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రాంత ప్రజలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటి ప్రజలకు భరోసానివ్వకుండా కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఇదే పరిస్థితి ఉంటే రాయచోటిలో పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande