ఇదే భారత్-యూఎస్ సంబంధాలను దెబ్బతీశాయా.?
ఎక్స్-పెంటగాన్ అధికారి సంచలన వ్యాఖ్యలు..
ఇదే భారత్-యూఎస్ సంబంధాలను దెబ్బతీశాయా.?


ఢిల్లీ 07 డిసెంబర్ (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసమర్థత కారణంగా భారత్, రష్యాలు మరింత దగ్గర అవుతున్నాయని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అన్నారు. పుతిన్ పర్యటన తర్వాత ఈ మాజీ అమెరికా అధికారి నోటి నుంచి ఈ మాటలు వచ్చాయి. ట్రంప్ చర్యల వల్ల వాషింగ్టన్, న్యూఢిల్లీ మధ్య సంబంధాలు తారుమారయ్యాయని, దీనికి అమెరికా పౌరులు కూడా ఆశ్చర్యపోతున్నారని ఆయన అన్నారు. పాకిస్తాన్ పొగడ్తలు లేదా లంచం వల్ల ఇది జరిగిందా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

‘‘భారత్‌తో సంబంధాలు దెబ్బతినేలా ట్రంప్‌ను ఏ కారణాలు ప్రోత్సహించాయని చాలా మంది అమెరికన్లు ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. బహుశా పాకిస్తాన్ పొగడ్తలు, టర్కీ, ఖతార్‌, దాని మద్దతుదారులు డొనాల్డ్ ట్రంప్‌కు లంచాలు ఇచ్చారు. ఇది రాబోయే దశాబ్ధాల్లో అమెరికాను వ్యూహాత్మకంగా ముంచెత్తే ఒక వినాశకరమైన లంచం’’ అని రూబిన్ అన్నారు. రష్యా చమురు కనుగోలు చేస్తున్న భారత్‌కు ఉపదేశాలు ఇవ్వడం ద్వారా అమెరికా కపటంగా వ్యవహరిస్తోందని, ఇదే అమెరికా రష్యాతో సంబంధాలు పెట్టుకుందని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande