జన్‌ ధన్‌ ఖాతాల్లో రూ.2.75 లక్షల కోట్లు’
ముంబై, 07 డిసెంబర్ (హి.స.) దేశవ్యాప్తంగా జన్‌ ధన్‌ ఖాతాల్లో (Jan Dhan accounts) రూ.2.75 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం.నాగరాజు తెలిపారు. ఈ లెక్కన ఒక్కో ఖాతాలో సగటున రూ.4,815లు ఉన్నట్లు అవుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్
RBI


ముంబై, 07 డిసెంబర్ (హి.స.) దేశవ్యాప్తంగా జన్‌ ధన్‌ ఖాతాల్లో (Jan Dhan accounts) రూ.2.75 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం.నాగరాజు తెలిపారు. ఈ లెక్కన ఒక్కో ఖాతాలో సగటున రూ.4,815లు ఉన్నట్లు అవుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.3.67 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా లబ్ధిదారులకు బదిలీ చేసినట్లు చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

భారతదేశ ఆర్థిక సమ్మిళితత్వ (Financial Inclusion) ప్రయాణాన్ని నాగరాజు ఒక ‘అద్భుతం’గా అభివర్ణించారు. 2014లో ప్రారంభించిన ప్రధానమంత్రి జన్‌ ధన్‌ యోజన పథకం (PMJDY) ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిందన్నారు. దీనివల్ల దాదాపు 57 కోట్ల మంది బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చారన్నారు. 78.2 శాతం జన్‌ ధన్‌ ఖాతాలు గ్రామీణ, సెమీ-అర్బన్‌ ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. అలాగే మొత్తం ఖాతాల్లో 50 శాతం మహిళలకు చెందినవని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande