
ఢిల్లీ 07 డిసెంబర్ (హి.స.) గోవాలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం (Goa Nightclub Fire)పై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
ఈ అగ్నిప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి (Draupadi Murmu) పేర్కొన్నారు. ఈ ఘటనలో కొందరు మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం జరగడం బాధాకరమని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో మాట్లాడినట్లు ప్రధాని పేర్కొన్నారు. బాధితులకు అవసరమైన సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. మోదీ తనతో మాట్లాడారని సీఎం ప్రమోద్ సావంత్ (Dr Pramod Sawant) తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆయనకు వివరించినట్లు పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు గోవా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ