
ముంబై, 07 డిసెంబర్ (హి.స.) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను ఆహ్వానించారు. శనివారం ఈ విందుపై థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పుతిన్‌తో డిన్నర్ జరిగిందని చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ స్టేట్ డిన్నర్‌కు లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశం అయింది. వీరిద్దర్ని ఆహ్వానించకుండా శశిథరూర్‌ను పిలవడంపై కాంగ్రెస్ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది.
శనివారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించిన విందులో పాల్గొన్న థరూర్, రష్యా ప్రతినిధి బృందంతో తన సంభాషణల్ని ఆస్వాదించినట్లు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. “నిన్న రాత్రి అధ్యక్షుడు పుతిన్ కోసం @rashtrapatibhvn విందుకు హాజరయ్యాను. ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన వాతావరణం నెలకొంది. హాజరైన చాలా మందితో, ముఖ్యంగా రష్యన్ ప్రతినిధి బృందంలోని సహచరులతో నా సంభాషణలను ఆస్వాదించాను!” అని ఆయన పోస్ట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ