ఏ.పీ, వెలగపూడి, 10 మార్చి (హి.స.)
ప్రజల సంతృప్తే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.అవినీతి ఒక జబ్బులాంటిదని, దానిని పూర్తిగా నిర్మూలించాలన్నారు. ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరును ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. లబ్ధిదారుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా రెవెన్యూ, ఆలయాలు, మున్సిపల్శాఖలో సేవలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో ఉద్యోగులకు కౌన్సిలింగ్ఇప్పించాలని ఆయన సూచించారు. అసెంబ్లీలో జరిగిన రివ్యూ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రి అనగాని సత్యప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..