రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్
ఏ.పీ, రాజమండ్రి. 12 మార్చి (హి.స.) వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. ఇవాళ అనగా బుధవారం ఉదయం 6.30కి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన లొంగిపోయారు. హైకోర్ట్ ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు అనిల్ తిరిగి వచ్చా
బోరుగడ్డ అనిల్


ఏ.పీ, రాజమండ్రి. 12 మార్చి (హి.స.)

వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. ఇవాళ అనగా బుధవారం ఉదయం 6.30కి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన లొంగిపోయారు. హైకోర్ట్ ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు అనిల్ తిరిగి వచ్చారు. నిన్న సాయంత్రం 5 గంటలకే మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. అయితే గడువు ముగిసిన 12 గంటల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు బోరుగడ్డ అనిల్ తిరిగి హాజరు అయ్యారు.

తన మధ్యంతర బెయిల్ మరోసారి పొడిగించాలని బోరుగడ్డ అనిల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళావారం విచారణ జరిగింది. బెయిల్ పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించింది. తక్షణమే లొంగిపోవాలని హైకోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న గడువులోగా సెంట్రల్ జైలుకు తిరిగి రాకపోవడంతో.. రాజమండ్రి జైలు అధికారులు హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. బోరుగడ్డ అనిల్ పై కోర్టు ధిక్కరణ నేరం కింద పరిగణించే అవకాశం ఉంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande