హైదరాబాద్, 12 మార్చి (హి.స.)సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచిన కేసులో సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో రేవతి ఇంటికి వెళ్లిన 12 మంది పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో రేవతి ఫోన్, ఆమె భర్త, దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఆమెకు చెందిన పల్స్ యూట్యూబ్ ఆఫీస్‌ను సైతం పోలీసులు సీజ్ చేశారు. రైతు బంధు రావట్లేదని ఓ రైతు మాట్లాడిన వీడియోను ప్రసారం చేస్తూ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో ఆమెను అరెస్టు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు