హైదరాబాద్, 12 మార్చి (హి.స.)
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతున్నట్లు పేర్కొంది.. ఒక ప్రాంతంలో వర్షాలు.. కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే.. 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.. ఈ మేరకు మూడు రోజుల వాతావరణ అంచనాను వెల్లడించింది.
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం:-
మంగళవారం, బుధవారం, గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశము
మంగళవారం, బుధవారం, గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు క్రమముగా 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు