విజయవాడ, 12 మార్చి (హి.స.)
నెమలి(గంపలగూడెం), : ఎన్టీఆర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి ఆలయ 68వ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 12 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు నెమలి కృష్ణుడిని తమ ఇలవేల్పుగా భావిస్తూ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆరు రోజులపాటు నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏర్పాట్లను సహాయ కమిషనర్ ఎన్.సంధ్య పర్యవేక్షిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల