తెలంగాణ, 12 మార్చి (హి.స.) తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఘనమైన సంస్కృతికి నిలయమని, అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి మహానుభావులు అంకితభావంతో కృషి చేశారని గుర్తు చేశారు. జననీ జయకేతనం” ను రాష్ట్ర గీతంగా స్వీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం సామాజిక న్యాయం, అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించామని తెలిపారు. ఈ బడ్జెట్ పూర్తిగా తెలంగాణ ప్రజల కలల సాకారానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని గవర్నర్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్