హైదరాబాద్, 12 మార్చి (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన బుధవారం కాంగ్రెస్ శాసనసభా
సమావేశం జరగనుంది. మధ్యాహ్నాం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలు-1లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. 2025-26 బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శాసనసభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం
రేవంత్ సభ్యులకు దిశా నిర్దేశం
చేయనున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..