ఏ.పీ, 10 మార్చి (హి.స.)
ఎమ్మెల్సీ తనకు రాకపోవటంపై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందిస్తూ
చంద్రబాబు నాయుడు నాకు దేవుడు.. నేను ఆయన భక్తుడిని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడు కూడా అప్పుడప్పుడు పరీక్ష పెడతాడు.. కానీ, నాకు పదవి వచ్చినా.. రాకపోయినా.. అంకిత భావంతో పనిచేస్తాను అని స్పష్టం చేశారు.. రాజకీయాల్లో పదవి అనేది ఒక క్రీడగా అభివర్ణించిన ఆయన.. ఒక్కోసారి పదవి వస్తుంది.. ఒక్కోసారి రాదు.. ఏ సందర్భంలో నైనా నేను ఒకేలా ఉంటాను అని పేర్కొన్నారు.. నాకు పదవి రాకపోయినా బాధ పడను అని వ్యాఖ్యానించారు.. ఇక, అనేక ఈక్వేషన్స్ తో ఎమ్మెల్సీల ఎన్నిక జరిగిందన్నారు.. కొత్త ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ ముగ్గురికి ఎమ్మెల్సీ ఇవ్వటం సరైందే అన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న..
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..