హైదరాబాద్, 10 మార్చి (హి.స.)
పుష్ప టీమ్ కు మరో షాక్ తగిలింది. పుష్ప-2 సినిమాకు వచ్చిన లాభాలను జానపద కళాకారుల పింఛన్ కోసం కేటాయించాలంటూ లాయర్ నరసింహారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం కింద పిల్ వేశారు. పుష్ప-2 టీమ్ కు భారీగా లాభాలు వచ్చాయని.. ఆ విషయాన్ని మూవీ నిర్మాతలే స్వయంగా ప్రకటించినట్టు ఆయన కోర్టుకు వివరించారు.
వాస్తవానికి పుష్ప సినిమాకు ఇంత లాభాలు రావడానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బెన్ ఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు కారణం అన్నారు. కాబట్టి ఆ లాభాలను సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం జానపద కళాకారుల పింఛన్ కోసం మళ్లించాలన్నారు. తెలంగాణ హోం శాఖ ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి మరీ పర్మిషన్ ఇచ్చిందని.. కాబట్టి ఆ లాభాల్లో వాటాలను పొందే హక్కు జానపద కళాకారులకు ఉందని నరసింహారావు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి కాపీలను సబ్మిట్ చేయాలంటూ కోర్టు రెండు వారాల దాకా విచారణ వాయిదా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..