తెలంగాణ, 10 మార్చి (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడిచినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. 15 నెలల్లో రూ ఒక లక్ష 50 వేల కోట్ల అప్పు అంటూ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రం రూ.1.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, వివాహం చేసుకునే మహిళలకు 10 గ్రాముల బంగారం, యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, రూ.4,000 పెన్షన్ వంటి కీలక వాగ్దానాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్