గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి.. భువనగిరి ఎమ్మెల్యే
తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా. 10 మార్చి (హి.స.) యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల రహదారుల నిర్మాణ పనులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. నారాయణగిరి నుండి దేశముఖి రోడ్డు, మో
భువనగిరి ఎమ్మెల్యే


తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా. 10 మార్చి (హి.స.) యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల రహదారుల నిర్మాణ పనులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. నారాయణగిరి నుండి దేశముఖి రోడ్డు, మోడల్ స్కూల్ రోడ్డు, వంక మామిడి నుండి శేరీలగూడెం రోడ్డు, అబ్దుల్లానగర్ రుద్రవెల్లి రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande