ముంబై , 10 మార్చి (హి.స.)ముంబై నుండి 320 మంది ప్రయాణీకులతో న్యూయార్క్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలో సోమవారం ఉదయం బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. గాల్లో ఉండగానే బాంబు బెదిరింపులు రావడంతో వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అప్పటికప్పుడే తిరిగి వెనక్కి పయనమయ్యారు.బాంబు అమర్చినట్లు సమాచారం అందగానే విమానాన్ని వెనక్కి మళ్లించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. విమాన సిబ్బంది, ప్రయాణీకులు క్షేమంగా ముంబైలో ల్యాండ్ అయినట్లు సమాచారం. బాంబు బెదిరింపులపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల