హైదరాబాద్, 10 మార్చి (హి.స.)
కనీసం అఖిలపక్ష సమావేశానికి కూడా కిషన్ రెడ్డి రాలేదు. కేంద్రం నుంచి నిధులు తెస్తే తాము తిరస్కరించమా? రింగ్ రోడ్డు అంటే పూర్తి వలయాకారంలో ఉండాలి. కానీ సగం ఇచ్చి దాన్ని రింగ్ రోడ్డంటూ ఎలా అంటారని?” సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర సమస్యలపై ఉమ్మడి పోరాటం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినా, బీజేపీ నేతలు హాజరుకాలేదని దుయ్యబట్టారు. కేసీఆర్పై భయంతోనే కిషన్ రెడ్డి సమావేశానికి రాలేదేమోనని ఎద్దేవా చేశారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడడంలో బీజేపీ వైఫల్యం చెందిందని ఆరోపించిన సీఎం రేవంత్, బుల్లెట్ ట్రైన్ గుజరాత్కు ఇచ్చారు. కానీ తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు?” అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ చెల్లించే పన్నులతో పోల్చితే, కేంద్రం నుంచి రాబడే నిధులు ఎంత తక్కువగా ఉన్నాయో ప్రజలకు అర్థమయ్యేలా చర్చకు రావాలని సవాల్ విసిరారు. “కిషన్ రెడ్డికి ధైర్యముంటే ఈ అంశంపై చర్చకు రావాలి. నేను సీఎం భట్టి విక్రమార్క్ తో సహా చర్చకు సిద్ధమే” అని ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..