కేటీఆర్ చేసిన కామెంట్స్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..
తెలంగాణ, 10 మార్చి (హి.స.) టీడీఆర్ పేరుతో రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి టీమ్ సన్నద్ధమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఉన
రేవంత్ రెడ్డి కౌంటర్


తెలంగాణ, 10 మార్చి (హి.స.)

టీడీఆర్ పేరుతో రూ.వేల కోట్లు

కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి టీమ్ సన్నద్ధమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఉన్న టీడీఆర్ మొత్తం షేర్లను కొంత మంది రేవంత్ అనుచరులు కొంటున్నారని కామెంట్ చేశారు. త్వరలోనే ఎఫ్ఎస్ఐ అమలు చేసి టీడీఆర్ లను అడ్డగోలు ధరకు అమ్మేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

ఈ క్రమంలోనే కేటీఆర్ చేసిన కామెంట్స్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరని.. కేసులకు భయపడితే క్రైమ్ చేయరని కామెంట్ చేశారు. అందుకే కేటీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు కేటీఆర్ గురించి మాట్లాడటం వేస్ట్ అని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande