విజయవాడ, 10 మార్చి (హి.స.)
ఈనాడు, అమరావతి: వైకాపా హయాంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ సహా వారి కుటుంబాల్లోని మహిళలపై అసభ్య పదజాలంతో పేట్రేగిపోయిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్ ఆయా కేసుల్లో రాజమహేంద్రవరం జైల్లో రిమాండులో ఉంటూనే ఆ పార్టీ ముఖ్య నేతలతో కాన్ఫరెన్స్ కాల్స్‌లో సంభాషణలు జరిపినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందేందుకు... తన తల్లికి అనారోగ్యం పేరిట నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు సృష్టించి, న్యాయస్థానానికి సమర్పించిన కుట్రకు ఈ కాన్ఫరెన్స్ కాల్స్ సంభాషణల్లోనే బీజం పడిందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. రాజమహేంద్రవరం కారాగారంలో అనిల్‌కుమార్ కదలికలు, ఫోన్ సంభాషణలపై నిఘా లేకపోవటం, జైలు సిబ్బంది అతనికి దాసోహమవడమే దీనికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల