ఉప రాష్ట్రపతి. జగదీప్ ధన్ ఖాద్.అస్వస్థతకు గురయ్యారు
విజయవాడ, 10 మార్చి (హి.స.) ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అస్వస్థతకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తలించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కార
ఉప రాష్ట్రపతి. జగదీప్ ధన్ ఖాద్.అస్వస్థతకు గురయ్యారు


విజయవాడ, 10 మార్చి (హి.స.)

ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అస్వస్థతకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తలించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రాజీవ్‌ నారంగ్‌ ఆధ్వర్యంలో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ (సీసీయూ)లో వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆదివారం ప్రధాని మోదీ ఎయిమ్స్‌కు వెళ్లి ధన్‌ఖడ్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. ఆ తర్వాత ధన్‌ఖడ్‌ ఆరోగ్యంగా ఉండాలని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సైతం ఆస్పత్రికి వెళ్లి ధన్‌ఖడ్‌ను పరామర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande