మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంటిపై ఈడీ దాడులు -
భిలాయ్‌ , 10 మార్చి (హి.స.)ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేశ్ బఘేల్ నివాసంపై సోమవారం ఈడీ దాడులు చేస్తోంది. భిలాయ్‌లోని భూపేశ్ బఘేల్, ఆయన కుమారుడు చైతన్య నివాసంపై అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 14 చోట్ల దాడులు జరుగు
మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంటిపై ఈడీ దాడులు -


భిలాయ్‌ , 10 మార్చి (హి.స.)ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేశ్ బఘేల్ నివాసంపై సోమవారం ఈడీ దాడులు చేస్తోంది. భిలాయ్‌లోని భూపేశ్ బఘేల్, ఆయన కుమారుడు చైతన్య నివాసంపై అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 14 చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ దాడులు జరుగుతున్నట్లుగా సమాచారం. అయితే ఈ కేసును కోర్టు కొట్టేసిందని భూపేశ్ బఘేల్ పేర్కొన్నారు. కేవలంలో కుట్రలో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు.

ఛత్తీస్‌గఢ్‌ మద్యం కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి. మద్యం సిండికేట్‌కు రూ.రెండువేల కోట్ల మేర లబ్ధి చేకూరిందని ఈడీ గతంలో పేర్కొంది. దర్యాప్తులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు వ్యాపారవేత్తలను అరెస్టు చేసింది. తాజాగా మరోసారి ఈడీ దాడులు నిర్వహించడంపై కాంగ్రెస్ శ్రేణులు తప్పుపడుతున్నారు. కుట్రలో భాగంగానే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande