తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 10 మార్చి (హి.స.)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన మోటె నరసింహ (50) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్తుల కథనం మేరకు నరసింహ గ్రామంలోనే పది ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. దీనికోసం అప్పు చేశారు. నీరు లేక పొలం ఎండిపోతుండటంతో సోమవారం ఉదయం మనస్థాపంతో వ్యవసాయ బావి వద్ద పురుగుల మందును సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్