కామారెడ్డి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రాజేష్ చంద్ర.
తెలంగాణ, కామారెడ్డి. 10 మార్చి (హి.స.) కామారెడ్డి జిల్లా ఎస్పీగా రాజేష్ చంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2015 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన రాజేశ్ చంద్ర ప్రస్తుతం ఎస్పీగా వ్యవహరిస్తున్న సింధు శర్మ నుంచి జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు.
కామారెడ్డి జిల్లా ఎస్పీ


తెలంగాణ, కామారెడ్డి. 10 మార్చి (హి.స.)

కామారెడ్డి జిల్లా ఎస్పీగా రాజేష్ చంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2015 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన రాజేశ్ చంద్ర ప్రస్తుతం ఎస్పీగా వ్యవహరిస్తున్న సింధు శర్మ నుంచి జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారిస్తామని నూతన ఎస్పీ వెల్లడించారు. ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande