రేవంత్ రెడ్డి వెనుక నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారు.. కేటీఆర్
తెలంగాణ, హైదరాబాద్. 10 మార్చి (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో నడవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీలో ఆయనది నడవకున్నా.. పైసలు మాత్రం బాగానే సంపాదిస్తున్నారని ఆరోపించారు. సోమవారం హైదరాబాదులో మీడియాతో మాట్లాడి
కేటీఆర్


తెలంగాణ, హైదరాబాద్. 10 మార్చి (హి.స.)

సీఎం రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో నడవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీలో ఆయనది నడవకున్నా.. పైసలు మాత్రం బాగానే సంపాదిస్తున్నారని ఆరోపించారు. సోమవారం హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్లో బీజేపీ కోవర్టులు ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి విమానం ఎక్కడం.. దిగడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా.. పూర్తి స్థాయి మంత్రివర్గం లేదని కేటీఆర్ అన్నారు.

రేవంత్ రెడ్డి వెనుక నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. డీడీఆర్ ఎక్కడ ఉన్నాయోనని ఆ నలుగురు బ్రోకర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande