ఆంధ్రప్రదేశ్.రాజధాని.అమరావతి నిర్మాణంలో భాగంగా చేసే భూ.కేటాయింపుల.విషయంలో గతంలో ఉన్న విధానాన్నే కొనసాగిస్తాం
విజయవాడ, 10 మార్చి (హి.స.) అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా చేసే భూకేటాయింపుల విషయంలో గతంలో ఉన్న విధానాన్నే కొనసాగిస్తామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. రాజధాని అమరావతిలో సంస్థలకు భూకేటాయింపులపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నా
ఆంధ్రప్రదేశ్.రాజధాని.అమరావతి నిర్మాణంలో భాగంగా చేసే భూ.కేటాయింపుల.విషయంలో గతంలో ఉన్న విధానాన్నే కొనసాగిస్తాం


విజయవాడ, 10 మార్చి (హి.స.)

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా చేసే భూకేటాయింపుల విషయంలో గతంలో ఉన్న విధానాన్నే కొనసాగిస్తామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. రాజధాని అమరావతిలో సంస్థలకు భూకేటాయింపులపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్‌, కొల్లు రవీంద్ర, టీజీ భరత్‌, కందుల దుర్గేశ్‌ సమావేశానికి హాజరయ్యారు. భేటీ అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ‘‘గతంలో 131 మందికి భూములు కేటాయించాం. వాటిలో 31 సంస్థలకు చేసిన కేటాయింపులను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. రెండు సంస్థలకు గతంలో కేటాయించిన విధంగా కాకుండా వేరే చోట కేటాయింపులు చేయాలని నిర్ణయించాం. 16 సంస్థలకు స్థలంతోపాటు పరిధిని మార్చాం’’ అని మంత్రి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande