ఏ.పీ, వెలగపూడి 10 మార్చి (హి.స.)
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ముగ్గురు అభ్యర్థులతో పాటు బీజేపీ అభ్యర్థి నేడు నామినేషన్ లు దాఖలు చేశారు. నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో అందరూ నామినేషన్ లు వేశారు. టీడీపీ తరుపున కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్ర, బీజేపీ తరుపున సోము వీర్రాజు లు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేనకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సేలు, ఎమ్మెల్సీల పాల్గొన్నారు. .
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..