తెలంగాణ, మెదక్. 10 మార్చి (హి.స.) ప్రజావాణి అర్జీలకు గుణాత్మక పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా అధికారులకు సూచించారు. టైం బౌండ్లో ప్రజా ఫిర్యాదులు, వినతులు పరిష్కరించాలన్నారు. మెదక్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ఇవాళ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఎ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీవో పీడీ శ్రీనివాసరావులతో కలిసి ప్రజల నుంచి కలెక్టర్ ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత స్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజావాణికి 60 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్