ప్రణయ్ పరువు హత్య కేసులో నల్లగొండ కోర్ట్ సంచలన తీర్పు..
తెలంగాణ, నల్గొండ. 10 మార్చి (హి.స.) 2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్లగొండ కోర్టు నేడు సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు ప్రధాన నిందితుడు సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ప్రకటించారు. అదేవిధంగా కేసు లో నిందితులుగా
ప్రణయ్ హత్య కేసు


తెలంగాణ, నల్గొండ. 10 మార్చి (హి.స.) 2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్లగొండ కోర్టు నేడు సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు ప్రధాన నిందితుడు సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ప్రకటించారు. అదేవిధంగా కేసు లో నిందితులుగా ఉన్న మరో ఆరుగురికి జీవిత ఖైదును విధించారు. కాగా, మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఏ1 నిందితుడిగా ఉన్న అమృత తండ్రి 2020లో ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఐదేళ్ల పాటు కొనసాగిన వాదోపవాదల అనంతరం ఇవాళ నిందితుల్లో ఒకరికి ఉరి శిక్ష, ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ 2వ అదనపు సెషన్స్ కోర్టు తుది తీర్పును వెలువరించింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande