తెలంగాణ, హైదరాబాద్. 10 మార్చి (హి.స.)
ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు
తీర్పు వెలువడిన నేపథ్యంలో, ఈ కేసును దర్యాప్తు చేసిన నల్గొండ జిల్లా మాజీ ఎస్పీ, ప్రస్తుత హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది మంది నిందితులకు కోర్టు శిక్ష విధించడంతో, తాము చేసిన దర్యాప్తుపై గర్వంగా ఉన్నామని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని అన్నారు. 2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో దర్యాప్తును అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించామని రంగనాథ్ తెలిపారు. దాదాపు ఏడు సంవత్సరాలపాటు దర్యాప్తు చేసి, కేసును ఛాలెంజ్ తీసుకుని నిందితులకు శిక్ష పడేలా చేసామని ఆయన వెల్లడించారు. ఈ కేసులో సీసీ ఫుటేజ్, టెక్నాలజీ ఎనలసిస్, హ్యూమన్ ఇన్వెస్టిగేషన్ ద్వారా అన్ని ఆధారాలను సేకరించామని, 9 నెలలపాటు శ్రమించి 1,600 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.
కేసు విచారణలో భాగంగా 67 మంది సాక్షులను విచారించి, వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్లు చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్