తెలంగాణ, వరంగల్. 10 మార్చి (హి.స.)
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముగ్గులు పోసి భూమి పూజ చేశారు. ఈ మేరకు నల్లబెల్లి మండలం రామతీర్థం గ్రామంలో అర్హులైన నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది.ఈ ఇండ్లకు సోమవారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదోడి సొంతింటి కల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే సహకారం అవుతుందన్నారు.
ఇల్లు లేని అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, ప్రజలు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు, బీసీ ఇతర సామాజిక వర్గాలకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్