న్యూఢిల్లీ, 10 మార్చి (హి.స.)
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 లో భారత్
అదరగొట్టింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో టీమిండియా వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా శ్రేయాస్ అయ్యార్ 62 0 48 , రాహుల్ 33 బంతుల్లో 34 పరుగులు, శుభ్మన్ గిల్ 50 బంతుల్లో 31 పరుగులు చేసి భారత జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో ముచ్చటగా మూడోసారి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఈ నేపథ్యంలో భారత జట్టు ప్రదర్శనపై ప్రధాని నరేంద్ర మోడీ ప్లాట్ ఫాం 'X' (ట్విట్టర్) వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. 'అసాధారణమైన ఆట.. అసాధారణ ఫలితం!, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఇంటికి తీసుకువచ్చినందుకు మన క్రికెట్ జట్టు పట్ల గర్వంగా ఉంది. వారు టోర్నమెంట్ ఆసాంతం అద్భుతంగా ఆడారు. అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన చేసినందుకు మా జట్టుకు అభినందనలు'. అంటూ ట్వీట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..