తెలంగాణ, పెద్దపల్లి. 10 మార్చి (హి.స.)
పెద్దపల్లి జిల్లా కేంద్రంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సఖీ కేంద్రం సేవలను ప్రజలకు, బాధితులకు మరింత చేరువ చేస్తూ మెరుగైన సేవలందించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లిలో నూతనంగా రూ.48లక్షలతో నిర్మించిన సఖీ కేంద్రం వన్ స్టాప్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కఠారి రేవతిరావుతో కలిసి సోమవారం ప్రారంభించారు.
అంతకు ముందు మహిళా కమిషన్ సభ్యురాలు, ఎమ్మెల్యేలకు జిల్లా సంక్షేమశాఖ అధికారి పి. వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్