మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
మధ్యప్రదేశ్, 10 మార్చి (హి.స.) సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 288 ఎనిమిది మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న కారు.. ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఎనిమిద
రోడ్డు ప్రమాదం


మధ్యప్రదేశ్, 10 మార్చి (హి.స.)

సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగి

288 ఎనిమిది మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న కారు.. ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది

మంది అక్కడిక్కడే మృతి చెందారు.

అలాగే మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన

సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంపై డీఎస్పీ గాయత్రి తివారి మాట్లాడుతూ.. నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో, ఉట్ని పెట్రోల్ పంప్ సమీపంలో బల్కర్, కారు మధ్య జరిగిన ప్రమాదంలో

దాదాపు 13 మంది గాయపడ్డారు. కనీసం ఎనిమిది మంది మరణించారు. బల్కర్ సిద్ధి నుండి బహ్రీకి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande