సిద్ధి జిల్లా 10 మార్చి (హి.స.)
సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ట్రక్కు, SUV ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించగా, 14 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్) సిద్ధి జిల్లాలోని ఉప్ని పెట్రోల్ పంప్ సమీపంలో జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. SUV వాహనం ఒక కుటుంబంతో మైహార్ వైపు ప్రయాణిస్తున్న క్రమంలో ఎదురుగా వేగంగా వచ్చిన ట్రక్కుతో యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘోరమైన ప్రమాదంలో SUVలో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల