న్యూఢిల్లీ, 10 మార్చి (హి.స.)
ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి వనాటు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. లలిత్ మోడీకి జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనాటు ప్రధాని జోతం నపట్.. పౌరసత్వ కమిషన్కు ఆదేశించారు. ఇటీవలే దక్షిణ పసిఫిక్ మహాసముద్ర దేశమైన వనాటు పౌరసత్వానికి చెందిన గోల్డెన్ పాస్పోర్టును లలిత్ మోడీ తీసుకున్నారు. ఇండియాలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినందుకు లలిత మోడీని స్వదేశానికి రప్పించేందుకు ఇప్పటికే భారత్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో వనాటు ప్రభుత్వం కూడా పాస్పోర్టును రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.
లలిత్ మోడీపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాక వనాటు ప్రభుత్వం అప్రమత్తం అయింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..