ముంబై, 10 మార్చి (హి.స.)
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. అన్నిరంగాల్లో అమ్మకాలు కనిపించాయి. ఉదయం మార్కెట్లు లాభాల్లో మొదలైనా.. చివరి సెషన్లో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు పతనమయ్యాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ ఉదయం.. 74,474.98 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత అదే ఉత్సాహం మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 74,741.25 గరిష్ఠానికి చేరుకుంది. అయితే, చివరి సెషన్లో లాభాల స్వీకరణకు దిగడంతో ఒక్కసారిగా మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 74,022.24పాయింట కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 217.41 పాయింట్లు తగ్గి.. 74,115.17 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92.20 పాయింట్లు తగ్గి.. 22,460.30 వద్ద ముగిసింది. మొదటి అర్ధభాగంలో నిఫ్టీ 22,650 పాయింట్ల మార్ను ధాటడంతో లాభాలను ఆర్జించింది.
కానీ, చివరి గంటలో లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్