విశాఖపట్నంలో విషాద ఘటన. గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి
విశాఖపట్నం, 10 మార్చి (హి.స.) విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలకు ఇన్విజిలెటరుగా హాజరైన ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. భీమునిపట్నం మండలం రేఖవానిపాలెం పంచాయితీ
విశాఖలో విషాదం


విశాఖపట్నం, 10 మార్చి (హి.స.)

విశాఖపట్నంలో విషాద ఘటన

చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలకు ఇన్విజిలెటరుగా హాజరైన ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. భీమునిపట్నం మండలం రేఖవానిపాలెం పంచాయితీ ప్రాథమిక పాఠశాలలో డబ్బీరు మాధవరావు(55) సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాడు. అయితే ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో ఆయనను ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఇన్విజిలేటర్ గా నియమించారు. ఈ క్రమంలో ఆయన భీమునిపట్నం ఇంటర్మీడియట్ పరీక్షలకు ఇన్విజిలేటర్గా హాజరు అవుతున్నారు. ప్రతి రోజులాగే ఈ రోజు(సోమవారం) ఉదయం 7.30 సమయంలో కళాశాలకు వెళ్లారు. ఈ క్రమంలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే అక్కడున్న వారు స్పందించి.. ప్రైవేటు ఆసుపత్రిలో తీసుకుని వెళ్లారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande