తెలంగాణ, ఆదిలాబాద్. 10 మార్చి (హి.స.) ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రభుత్వ
ఆశ్రమ పాఠశాలలో బాలిక మృతి చెందిన విషాద ఘటన సోమవారం చోటుచేసుకుంది. హత్నూర్ మండలంలోని మూర్ఖండ్ గ్రామానికి చెందిన రాజేశ్వర్ కూతురు లాలిత్య ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. సోమవారం ఉదయం పాఠశాల సిబ్బంది లాలిత్య మృతి చెందినట్లు బాలిక కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకొని బాలిక మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. హుటాహుటిన పోలీసులు బాలిక మృతదేహాన్ని బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్