మెదక్ జిల్లాలో మహిళ దారుణ హత్య.
తెలంగాణ, మెదక్. 10 మార్చి (హి.స.) మెదక్ జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని రిమ్మనగూడలో సోమవారం తెల్లవారుజామున ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అడ్డుకోబోయిన భర్తను కూడా తీవ్రంగా గాయపరిచిన దుండగులు పరారయ్యారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్కు చెందిన సాదక్ తన భార
మహిళా హత్య


తెలంగాణ, మెదక్. 10 మార్చి (హి.స.)

మెదక్ జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని రిమ్మనగూడలో సోమవారం తెల్లవారుజామున ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అడ్డుకోబోయిన భర్తను కూడా తీవ్రంగా గాయపరిచిన దుండగులు పరారయ్యారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్కు చెందిన సాదక్ తన భార్య ఆస్రా బేగంతో కలిసి గత కొంతకాలంగా రిమ్మనగూడ హెచ్ పీ పెట్రోల్ పంపు వద్ద సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం సొంత పని నిమిత్తం ఆస్రా హైదరాబాద్కు వెళ్లిందని ఒక్కతే వెళ్లిన ఆస్రా బేగం తిరుగు ప్రయాణంలో రాత్రికి మరో వ్యక్తితో కలిసి రిమ్మనగూడకు వచ్చిందని అన్నారు. తెల్లవారుజామున వారిద్దరు గొడవపడ్డారని, దీంతో అతడు పారతో, ఆస్రా బేగం ముఖంపై విచక్షణా రహితంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిందని సాదక్ తెలిపాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande