జాతీయ విద్యా విధానంపై ఆందోళన.. లోక్‌సభలో డీఎంకే vs భాజపా
దిల్లీ: , 10 మార్చి (హి.స.)కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడు అధికార పార్టీ డీఎంకే (DMK) వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశాన్ని లోక్‌సభలో (Lok Sabha) డీఎంకే ఎంపీలు లేవనెత్తడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎంపీల
జాతీయ విద్యా విధానంపై ఆందోళన.. లోక్‌సభలో డీఎంకే vs భాజపా


దిల్లీ: , 10 మార్చి (హి.స.)కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడు అధికార పార్టీ డీఎంకే (DMK) వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశాన్ని లోక్‌సభలో (Lok Sabha) డీఎంకే ఎంపీలు లేవనెత్తడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎంపీల చర్యపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మండిపడ్డారు. దీంతో స్పీకర్‌ ఓం బిర్లా సభను వాయిదా వేసి.. తిరిగి ప్రారంభించారు.

కొత్త విద్యా విధానాన్ని తమిళనాడులో అమలుచేయడంపై డీఎంకే ఎంపీలు నిరసిస్తూ వెల్‌ వైపు వెళ్లడంతో కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతీయ విద్యావిధానంపై చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ‘‘విద్యార్థుల భవిష్యత్తుతో డీఎంకే చెలగాటమాడుతోంది. వారంతా నిజాయతీ లేనివారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు డీఎంకే సిద్ధంగా లేదు. భాష పరమైన వివాదాలు సృష్టించడమే వారు పనిగా పెట్టుకున్నట్లున్నారు. రాజకీయాలు చేస్తున్నారు. వారి చర్యలు ప్రజాస్వామ్య వ్యతిరేకం’’ అని ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande