శ్రీచైతన్య విద్యా సంస్థల కార్యాలయాల్లో ఆదాయం పన్నుశాఖ అధికారుల తనిఖీలు..
తెలంగాణ, 10 మార్చి (హి.స.) తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థ శ్రీచైతన్య విద్యా సంస్థల కార్యాలయాల్లో ఆదాయం పన్నుశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విద్యా సంస్థలకు వస్తున్న ఆదాయం, ఆ ఆదాయంపై చెల్లిస్తున్న పన్నులు, విద్యా సంస్థల నిర్వ
ఐటీ దాడులు


తెలంగాణ, 10 మార్చి (హి.స.)

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన

విద్యా సంస్థ శ్రీచైతన్య విద్యా సంస్థల కార్యాలయాల్లో ఆదాయం పన్నుశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విద్యా సంస్థలకు వస్తున్న ఆదాయం, ఆ ఆదాయంపై చెల్లిస్తున్న పన్నులు, విద్యా సంస్థల నిర్వహణకు వ్యయంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆదాయం పన్నుశాఖ పరిశీలనలో తేలింది. దీంతో హైదరాబాద్, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గల శ్రీచైతన్య విద్యా సంస్థల కార్యాలయాల్లో సోమవారం ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు.

హైదరాబాద్లోని మాదాపూర్లో గల శ్రీ చైతన్య విద్యా సంస్థల కార్పొరేట్ కార్యాలయం సహా అన్ని కళాశాలల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande