ఢిల్లీ, 10 మార్చి (హి.స.)పార్లమెంట్‌లో లోక్‌సభ స్పీకర్‌తో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ, సోదరి ప్రియాంకాగాంధీ సమావేశం అయ్యారు. ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. స్పీకర్‌తో ఏం చర్చించారన్నది ఇంకా తెలియలేదు. అయితే త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా డీఎంకే సభ్యులు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేపట్టారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.
ఇదిలా ఉంటే రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాపై అనేక అనుమానాలు ఉన్నాయని.. వీటిపై సభలో చర్చించాలని కోరారు. ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలకు కూడా అనేకమైన అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. మహారాష్ట్ర జాబితాతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న జాబితాపై చర్చించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు