తెలంగాణ, మెదక్. 11 మార్చి (హి.స.)
మెదక్ మున్సిపల్ అర్ ఐ జానయ్య ఏసీబీకి పట్టుబడ్డాడు. మంగళవారం ఓ వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం.. బాధితుడి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు మెదక్ మున్సిపల్ కార్యాలయంలో విచారణ జరుపుతున్నారు. బాధితుడి వివరాలు, ఎంత డబ్బు అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్