ఏ.పీ వెలగపూడి, 11 మార్చి (హి.స.)
సోషల్ మీడియాలో విచ్చలవిడితనం పెరిగిపోయిందని, దీంతో ఆడబిడ్డలు తలెత్తుకోలేని పరిస్థితి నెలకొందన్నారు ఎపి సిఎం చంద్రబాబు.. దీనిని అరికట్టేందుకు ప్రత్యేకంగా ఒక సైబర్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. హద్దుదాటి పోస్టింగ్ లు చేసిన వారిని గుర్తించి చట్ట ప్రకారం వారిని శిక్షిస్తామని చెప్పారు.. అసెంబ్లీలో నేడు ఆయన మాట్లాడుతూ తాము తీసుకుంటున్న చర్యలతో. ఇకపై ఎవరైనా ఆడబిడ్డలపై అత్యాచారాలు చేసి తప్పించుకోవాలనుకుంటే కూటమి ప్రభుత్వంలో వీలుకాదన్నారు. ఆడబిడ్డలను వేధించే అకతాయలకు పోస్ట్ పెట్టిన రోజే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..