హైదరాబాద్, 11 మార్చి (హి.స.)
మద్యం అమ్మకాలపై చర్చ కాస్తా..
అధికార, ప్రతిపక్షం మధ్య నేడు శాసనమండలిలో కాకరేపింది.. మద్యం విక్రయాలు, అక్రమాలపై మండలిలో మాట్లాడిన మంత్రి కొల్లురవీంద్ర.. మద్యం కుంభకోణంపై సిట్ వేశాం. సిట్ వేసిన సాయంత్రానికే తాడేపల్లి ప్యాలెస్ లో మొత్తం తగలబెట్టేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, ఎంతమంది ఈ అక్రమాల్లో ఉన్నారో తేలుస్తాం... సీఐడీ విచారణలో అన్నీ తేలుస్తాం అన్నారు.. ఇక, మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయన అభ్యంతరం వ్యక్తం చేశారు.. శాసనమండలి విపక్షనేత బొత్స మాట్లాడుతూ.. తప్పు జరిగితే విచారణ జరిపించుకోవడం ఆయా ప్రభుత్వాల విధానం.. తాడేపల్లి ప్యాలెస్ లో రికార్డులు తగలబెట్టేశారనడం సరికాదు.. రికార్డుల నుంచి మంత్రి వ్యాఖ్యలు తొలగించాలని డిమాండ్ చేశారు.. అంతేకాదు.. ఆధారాలుంటే రుజువుచేయండి. బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదు. తగలబెట్టినట్లు ఆధారాలుంటే కేసు ఫైల్స్ లో ఎంక్వైరీ బైండింగ్స్ లో చేర్చుకోండి అని సవాల్ చేశారు బొత్స.
అయితే ప్రమాదం పై విచారణ జరిపించామని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు.. మాదగ్గర కొన్ని ఆధారాలున్నాయి. ప్రభుత్వ సీసీ కెమెరాల్లో కొంతమేర ఆధారాలున్నాయన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..