ఏ.పీ, వెలగపూడి. 11 మార్చి (హి.స.) శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. శాసన మండలిలో మాత్రం వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.. దీంతో.. మంగళవారం శాసనమండలిలో బుడమేరు బాధితులకు వరద సాయంపై మంత్రి వంగలపూడి అనిత వర్సెస్ బొత్స సత్యనారాయణగా మారింది పరిస్థితి.. మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించాం.. నేనే అందుకు బాధ్యత తీసుకున్నాను అన్నారు. దీనిపై
హోంమంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ.. ఆక్రమణల కారణంగా బుడమేరు వరదలు వచ్చాయన్న ఆమె.. 2005 లో భారీ వరదలు విజయవాడను ముంచెత్తాయి. బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్ధ్యాన్ని 35 వేల క్యూసెక్కులకు పెంచేందుకు 464 కోట్లతో పనులు ప్రారంభించారు. 80 శాతం పనులు పూర్తయ్యాయి.. 20 శాతం నేటికీ పూర్తవ్వలేదు.. గత ప్రభుత్వం వదిలేయడం వల్లే మొన్నటి వరదల్లో విజయవాడ మునిగిపోయిందని ఆరోపించారు..
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..